టైరు పేలి అదుపుత‌ప్పిన కారు.. న‌లుగురు మృతి

Road Accident in Nizamabad District.నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వెలుతున్న కారు టైరు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Aug 2022 8:44 AM IST
టైరు పేలి అదుపుత‌ప్పిన కారు.. న‌లుగురు మృతి

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వెలుతున్న కారు టైరు పేల‌డంతో అదుపు త‌ప్పి గాల్లోకి ఎగిరి ప‌ల్టీలు కొడుతూ డివైడ‌ర్‌ను దాటి అవ‌త‌లి రోడ్డులో ప‌డింది. ముప్కాల్ బైపాస్ కొత్త‌ప‌ల్లి వ‌ద్ద ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌మాదంలో న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆర్మూర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాద స‌మ‌యంలో కారులో ఏడుగురు ఉన్నారు. మృతుల్లో ఇద్ద‌రు చిన్నారులు ఉన్నారు. పోలీసులు మృత‌దేహాల‌ను పోస్టు మార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. హైదరాబాద్‌ నుంచి నిర్మల్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Next Story