నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Road Accident in Nalgonda district.నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెలుతున్న ఆటోను లారీ ఢీ కొట్టింది.. ఆరుగురు మృతి
By తోట వంశీ కుమార్ Published on
21 Jan 2021 2:19 PM GMT

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెలుతున్న ఆటోను లారీ ఢీ కొట్టింది. సంఘటన స్థలంలోనే ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా దేవరకొండ మండలం చింతబావికి చెందిన వారుగా తెలుస్తుంది.
వివరాల్లోకి వెళితే.. చింతబావి గ్రామానికి చెందిన కూలీలు రంగారెడ్డి గూడెంలో నాట్లు వేసి ఆటోలో తిరిగి వస్తున్నారు. మరో 10 నిమిషాల్లో అందరూ ఇంటికి చేరేవారే. అయితే.. అంగడిపేట వద్ద ఓ లారీ ముందు వెలుతున్న వాహానాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆటోని ఢీకొట్టింది. ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఐదుగురు మహిళలు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆటోలో లెక్కకు మించిన సంఖ్యలో ప్రయాణీస్తున్నారు.
Next Story