మేడారం వెలుతుండగా రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
Road Accident in Mulugu District five people dead.ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును
By తోట వంశీ కుమార్ Published on
19 Feb 2022 4:52 AM GMT

ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. హనుమకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మేడారం నుంచి తిరుగు ప్రయాణమైంది. ములుగు శివారులోని గట్టమ్మ ఆలయం వద్దకు వచ్చే సరికి మేడారం వైపు వేగంగా వెలుతున్న కారు అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణీస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. వరంగల్ వైపు నుంచి మేడారం వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మేడారం జాతరకు ఈ రోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ క్రమబద్దీకరిచేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
Next Story