క‌ర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు దుర్మ‌ణం

Road Accident in Kurnool three dead.క‌ర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. శివారులోని ఔట‌ర్ రింగ్ రోడ్డు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 July 2022 9:54 AM IST
క‌ర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు దుర్మ‌ణం

క‌ర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. శివారులోని ఔట‌ర్ రింగ్ రోడ్డు స‌మీపంలోని జాతీయ ర‌హ‌దారిపై కారు, లారీ ఢీ కొన్నాయి. బుధ‌వారం తెల్ల‌వారుజామున ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.


క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ప్ర‌మాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. మృతుల‌ను అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గంకు చెందిన గణేష్, రుద్ర, సోమ శేఖర్ లుగా గుర్తించారు. క్ష‌త‌గాత్రులు ప్ర‌స్తుతం షాక్‌లో ఉన్నార‌ని వారు ప్ర‌స్తుతం మాట్లాడ‌లేక‌పోతున్నార‌ని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. జాతీయ ర‌హ‌దారిపై ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో ట్రాఫిక్ జాం అయ్యింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించారు.

Next Story