క‌ర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. లారీ కింద‌కు దూసుకెళ్లిన కారు.. ముగ్గురు దుర్మ‌ర‌ణం

Road Accident in Kurnool district three people dead.క‌ర్నూలు జిల్లాలో శుక్ర‌వారం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆగి ఉన్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Feb 2022 11:53 AM IST
క‌ర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. లారీ కింద‌కు దూసుకెళ్లిన కారు.. ముగ్గురు దుర్మ‌ర‌ణం

క‌ర్నూలు జిల్లాలో శుక్ర‌వారం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆగి ఉన్న లారీ కింద‌కి కారు దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న ఉలింద‌కొండ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని జాతీయ ర‌హ‌దారిపై చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు అక్క‌డిక్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మృతుల‌ను ఒకే కుటుంబానికి చెందిన శ్రీనివాసులు, ఆదిల‌క్ష్మీ, భాగ్య‌ల‌క్ష్మిగా గుర్తించారు. బంధువులు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతుండ‌డంతో వారిని ప‌రామ‌ర్శించేందుకు ధ‌ర్మ‌వ‌రానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన సభ్యులుకారులో క‌ర్నూలు వెలుతుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని క్ష‌తగాత్రులు తెలిపారు. అతివేగ‌మే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని స్థానికులు చెబుతున్నారు.

Next Story