కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

Road accident in Krishna district, Four killed. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన ఓ కారు కల్వర్టును ఢీ కొట్టింది. ఈ దుర్ఘ

By అంజి  Published on  13 March 2022 8:26 AM IST
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన ఓ కారు కల్వర్టును ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. జగ్గయ్యపేట మండలం గౌరవరం దగ్గర ఈ ఘటన జరిగింది. హైదరాబాద్‌ నుండి జంగారెడ్డి గూడెం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ప్రమాదానికి కారణం అతి వేగమేనని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలోని నారాయణఖేడ్‌ మండలం నిజాంపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బైక్‌ ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కామారెడ్డి జిల్లా జలాల్‌పూర్‌గా చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Next Story