లారీ బోల్తా.. ముగ్గురు మృతి.. మృతుల్లో చిన్నారి కూడా

Road accident in Krishna District.కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. లారీ బోల్తా ప‌డి ఒకే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 July 2021 9:42 AM IST
లారీ బోల్తా.. ముగ్గురు మృతి.. మృతుల్లో చిన్నారి కూడా

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. లారీ బోల్తా ప‌డి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మ‌ర‌ణించారు. వివ‌రాల్లోకి వెళితే.. బీహార్ నుంచి బియ్యం లోడుతో లారీ బెంగ‌ళూరుకు వెలుతోంది. ఈ క్రమంలో గన్నవరం మండలం కేసరపల్లి వద్ద లారీ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్ర‌మాదంలో బియ్యం బ‌స్తాల‌పై కూర్చున్న దంప‌తుల‌తో పాటు వారి చిన్నారిపై బియ్యం మూట‌లు ప‌డ‌డంతో అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బియ్యం బస్తాల కింద నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మృతుల‌ను తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన రాజ్యలక్ష్మి(29), శ్రీనివాస్‌(27), రోహిత్‌(2)లుగా గుర్తించారు. లారీని క్లీనర్‌ నడపడం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story