కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు దుర్మ‌ర‌ణం

Road Accident in Kakinada District four dead. కాకినాడ జిల్లాలో బుధ‌వారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Nov 2022 7:58 AM IST
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు దుర్మ‌ర‌ణం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో బుధ‌వారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆగి ఉన్న లారీని టాటా మ్యాజిక్ వాహ‌నం ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు మ‌ర‌ణించారు. మ‌రో తొమ్మిది మంది వ‌ర‌కు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న గండేప‌ల్లి మండ‌లం మ‌ల్లేప‌ల్లిలో చోటు చేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను రాజ‌మండ్రి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు.

ప్ర‌మాద స‌మ‌యంలో టాటా మ్యాజిక్ వాహ‌నంలో 13 మంది ఉన్నారు. అన‌కాప‌ల్లి జిల్లా క‌ళింకోట‌లోని ప‌ర‌మ‌ట‌మ్మ త‌ల్లి ఆల‌యానికి వెలుతుండ‌గా ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. టాటా మ్యాజిక్ వాహ‌నం డ్రైవ‌ర్ కొండా(38) ఘ‌ట‌నాస్థ‌లంలోనే మృతి చెంద‌గా.. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ నారాయ‌ణ‌రానికి చెందిన ప్ర‌సాద్‌(48), ఉండ్రాజ‌రానికి చెందిన మ‌హేశ్‌(28), న‌ల్ల‌జ‌ర్ల‌కు చెందిన మంగ‌(36) మ‌ర‌ణించారు. దీంతో ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య నాలుగు కు చేరింది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story