క‌డ‌ప జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు దుర్మ‌ర‌ణం

Road Accident in Kadapa District four people dead.కడప జిల్లా చింత‌కొమ్మ‌దిన్నె మండ‌లంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 March 2022 2:06 PM IST
క‌డ‌ప జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు దుర్మ‌ర‌ణం

కడప జిల్లా చింత‌కొమ్మ‌దిన్నె మండ‌లంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. అదుపుత‌ప్పిన బొలేరో వాహ‌నం ఇంటి ముందు కూర్చున వారిపైకి దూసుకువ‌చ్చింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు దుర్మ‌ర‌ణం చెందారు.

వివ‌రాల్లోకి వెళితే.. చింత‌కొమ్మ‌దిన్నె మండ‌లం మ‌ద్దిమ‌డుగు గ్రామంలో కొండ‌య్య‌(45), అమ్ములు(30) దంప‌తులు నివ‌సిస్తున్నారు. వీరి ఇంటి ప‌క్క‌నే దేవీ(27), ల‌క్ష్మీదేవీ(35) అనే మ‌హిళ‌లు ఉంటున్నారు. కాగా.. వీరంద‌రూ కొండ‌య్య ఇంటి ముందు మంచంపై కూర్చోని మాట్లాడుకుంటుండ‌గా.. క‌డ‌ప నుంచి రాయ‌చోటికి వెలుతున్న బొలేరో వాహ‌నం అతివేగంగా వ‌చ్చి వీరిని ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో కొండ‌య్య‌, ల‌క్ష్మీదేవీ అక్క‌డిక్క‌డే మృతి చెందారు.

అమ్ములు, దేవీల‌ను క‌డ‌ప రిమ్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా ప్రాణాలు కోల్పోయారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. అప్ప‌టికే స్థానికులు బొలేరో డ్రైవ‌ర్‌ను ప‌ట్టుకుని చిత‌క‌బాదారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం క‌డ‌ప నిమ్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించిన పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. డ్రైవర్ మద్యం సేవించి వాహ‌నం న‌డిపాడా అన్న కోణంలోనూ విచార‌ణ చేప‌ట్టారు.

Next Story