జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హనుమకొండ నుంచి హైదరాబాద్ వెలుతున్న టవేరా వాహనం జనగామ జిల్లా రఘునాథపల్లె మండలం గోవర్థనగిరి దర్గా వద్దకు రాగానే టైరు పంక్చర్ అయింది. దీంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. అప్పటికి వేగం తగ్గకపోవడంతో డివైడర్‌పైనే కొంత దూరం వెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు రోడ్డు పై పడిపోయారు.
ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మిగిలిన నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. వాహనాన్ని రోడ్డుపై నుంచి అడ్డు తొలగించి రాకపోకలను పునరుద్దరించారు. కాగా.. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ములుగు జిల్లాలో..
ములుగు జిల్లా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఏటూరునాగారం వద్ద జాతీయ రహదారిపై కారును ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఇంకొకరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను ములుగు మండలంలోని జాకారానికి చెందిన వల్లాల కృష్ణయ్య (45), వరంగల్‌కు చెందిన శివ (17)గా గుర్తించారు.