ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆటోను ఢీ కొట్టిన కంటైన‌ర్‌.. ఆరుగురు మృతి

Road Accident in chengalpattu 6 dead.త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Dec 2022 11:05 AM IST
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆటోను ఢీ కొట్టిన కంటైన‌ర్‌.. ఆరుగురు మృతి

త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆటోను కంటైన‌ర్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు.

తిరువన్నామళైలో కార్తికై దీప ఉత్సవంలో పాల్గొన్న ప‌లువురు ఆటోలో త‌మ గ్రామానికి బ‌య‌లు దేరారు. చెంగ‌ల్ప‌ట్టు జిల్లా మ‌ధురాంత‌కం వ‌ద్ద తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై బుధ‌వారం తెల్ల‌వారుజామున వీరు ప్ర‌యాణిస్తున్న ఆటోను కంటైనర్ లారీ ఢీ కొట్టింది. ప్ర‌మాదం ధాటికి ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థలానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఘ‌ట‌నాస్థ‌లంలోనే ఆరుగురు మృతి చెంద‌గా, మ‌రో 9 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో ఐదుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. మృతుల‌ను చెన్నైకి చెందిన చంద్ర‌శేఖ‌ర్‌(70), శ‌శికుమార్‌(35), దామోద‌ర‌న్‌(28), య‌హుమ‌లాయ్‌(65), గోకుల్‌(33), శేఖ‌ర్‌(55) గా గుర్తించారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Next Story