అన్న‌మ‌య్య జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కల్వర్టును ఢీకొట్టిన కారు.. న‌లుగురు మృతి

Road Accident in Annamayya District four dead.అన్న‌మ‌య్య జిల్లాలో గురువారం ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఓ కారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 May 2022 5:25 AM GMT
అన్న‌మ‌య్య జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కల్వర్టును ఢీకొట్టిన కారు.. న‌లుగురు మృతి

అన్న‌మ‌య్య జిల్లాలో గురువారం ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఓ కారు అదుపు త‌ప్పి క‌ల్వ‌ర్టును ఢీ కొట్టి కింద ప‌డి పోయింది. ఈ ఘ‌ట‌న‌లో కారులో ప్ర‌యాణిస్తున్న న‌లుగురు మృతి చెందారు. పుంగ‌నూరు రోడ్డులోని 150 మైలు వ‌ద్ద ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

మృతుల‌ను నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన దంపతులు గంగిరెడ్డి, మధులత, వారి కుమార్తె కుషితారెడ్డి, కుమారుడు దేవాన్ష్‌రెడ్డిగా గుర్తించారు. ప‌ల‌మ‌నేరులో ఓ పెళ్లి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వీరు తిరుగి ఇంటికి వెలుతుండ‌గా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it