అనంత‌పురం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. బీరు తాగుతూ డ్రైవింగ్.. న‌లుగురి మృతి

Road accident in anantapuram district.అనంత‌పురం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. మ‌ద్యం మ‌త్తు న‌లుగురి మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 March 2021 3:09 AM GMT
Road accident in anantapuram district

అనంత‌పురం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. మ‌ద్యం మ‌త్తు న‌లుగురి ప్రాణాల‌నుబ‌లిగొంది. లారీని వెనుక నుంచి వ‌చ్చిన కారు వేగంగా ఢీకొట్టింది. పెనుకొండ మండ‌లం ఎర్ర‌మంచి స‌మీపంలోని కియాకార్ల ప‌రిశ్ర‌మ ప్ర‌ధాన గేటు వ‌ద్ద ఈ ఘ‌ట‌న జరిగింది. సోమవారం అర్ధరాతి జరిగిన ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు. ఇందులో ఇద్దరు యువతులు, మరో ఇద్దరు యువకులు ఉన్నారు. కారు బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

జాతీయ ర‌హ‌దారిపై ఉన్న స్పీడు బ్రేక‌ర్ వ‌ద్ద ముందు వెలుతున్న లారీ కాస్త నెమ్మ‌దించింది. అదే స‌మ‌యంలో వెన‌క నుంచి వ‌చ్చిన కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘ‌ట‌న‌లో కారులో ప్ర‌యాణిస్తున్న రేఖ (21), అంచల్‌ సింగ్‌ (21), మహబూబ్‌ అలం (31), మనోజ్‌ మిట్టల్‌ (38) అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మ‌నోజ్ మిట్ట‌ల్ ది బెంగళూరు కాగా.. మరో ముగ్గురు ఢిల్లీకి చెందిన వారని సమాచారం. వీరంతా కర్ణాటకలోని యశ్వంత్‌పూర్‌ నుంచి వస్తున్నట్లు తెలిసింది.

స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. ప్ర‌మాదానికి గురైన కారు డ్రైవ‌ర్ చేతిలో బీరు సీసాను పోలీసులు గుర్తించారు. మ‌ద్యం మ‌త్తులోనే ప్ర‌మాదం జ‌రిగి ఉంటుంద‌ని బావిస్తున్నారు. కారును జేసీబీ సాయంతో రోడ్డుపై నుంచి ప‌క్క‌కు తీసి.. ట్రాఫిక్‌ను పున‌రుద్ద‌రించారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Next Story
Share it