అనంత‌పురం జిల్లాలో ఘోర ప్ర‌మాదం..ఆగి ఉన్న లారీని ఢీ కొన్న బ‌స్సు.. ముగ్గురు మృతి

Road Accident in Ananatapuram district three dead.అనంత‌పురం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 April 2022 2:46 AM GMT
అనంత‌పురం జిల్లాలో ఘోర ప్ర‌మాదం..ఆగి ఉన్న లారీని ఢీ కొన్న బ‌స్సు.. ముగ్గురు మృతి

అనంత‌పురం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు దుర్మ‌ర‌ణం చెందారు. వివ‌రాల్లోకి వెళితే.. పెద్దవ‌డుగూరు మండ‌లం మిడుతూరు వ‌ద్ద ఆగి ఉన్న లారీని బెంగ‌ళూరు నుంచి హైద‌రాబాద్ వెలుతున్న బ‌స్సు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో లారీలో ఉన్న ఇద్ద‌రితో పాటు బ‌స్సులోని ఓ వ్య‌క్తి అక్కడికక్క‌డే మృతి చెందారు. మ‌రో 15 మంది గాయ‌ప‌డ్డారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయక చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. డ్రైవ‌ర్ నిద్ర మ‌త్తు వ‌ల్ల‌నే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 20 మంది వ‌ర‌కు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Next Story
Share it