హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంతో వచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందారు, మరోకరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘన కీసర మండలం యాద్గర్‌పల్లి వద్ద ఓఆర్‌ఆర్‌పై జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి వచ్చారు. మృతి చెందిన వారు సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్‌ కుటుంబ సభ్యులుగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వారిలో ఏసీపీ ప్రసాద్‌ భార్య శంకరమ్మ, సోదరుడి కుమారుడు భాస్కర్‌ దంపతులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఏసీపీ ప్రసాద్‌ సోదరుడు బాలకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఏపీలోని చీరాలలో ఓ పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story