బెయిల్‌పై బయటకొచ్చి.. అత్యాచార బాధితురాలిపై గ్యాంగ్‌ రేప్‌

Released on bail, accused rapes victim again in Jabalpur. రెండేళ్ల క్రితం ఓ యువతిపై అత్యాచారం చేసి జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి.. ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు.

By అంజి  Published on  3 Aug 2022 4:51 PM IST
బెయిల్‌పై బయటకొచ్చి.. అత్యాచార బాధితురాలిపై గ్యాంగ్‌ రేప్‌

రెండేళ్ల క్రితం ఓ యువతిపై అత్యాచారం చేసి జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి.. ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు. అంతే తడవుగా మరోసారి దారుణానికి పాల్పడ్డాడు. ఆ అత్యాచార బాధితురాలిపై మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడు. మొదట అత్యాచారం జరిగినప్పుడు బాధితురాలు మైనర్. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఒక నెల క్రితం ఇది వరకు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తే.. మళ్లీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడని బాధితురాలు పేర్కొంది.

అయితే బాధితురాలు మంగళవారం ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. వివేక్ పటేల్ అనే నిందితుడు బెయిల్‌పై బయటకు వచ్చినప్పటి నుంచి తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. తనపై అఘాయిత్యానికి పాల్పడి, వీడియో తీశాడని, వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానని బెదిరింపులకు దిగుతున్నాడని చెప్పింది. 2020లో తనపై అత్యాచారం చేసిన నిందితుడు వివేక్ పటేల్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి మళ్లీ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. ''మేము ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నాము. నిందితుడి కోసం గాలిస్తున్నాం'' అని పోలీసులు తెలిపారు.

Next Story