హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి సాకేత్ కాలనీలో దారుణ హత్య జరిగింది.
By - Knakam Karthik |
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి సాకేత్ కాలనీలో దారుణ హత్య జరిగింది. ఫాస్టర్ బిలభాంగ్స్ స్కూల్ ముందు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో నరికి, రివాల్వర్ తో కాల్చి నడిరోడ్డుపై అతికిరాతకంగా దారుణ హత్య చేశారు. నడి రోడ్డుపై ఘంటా వెంకటరత్నం (50) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కత్తులతో నరికి చంపిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సోమవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో వెంకటరత్నం తన పాపను స్కూల్లో దించి యాక్టివా నెంబర్ టిఎస్ 08 ఈపీ 3075 స్కూటర్ పై తిగిగి వెళుతున్న క్రమంలో దుండగులు ఒక్కసారిగా అతనిపై దాడి చేశారు.
మొదటగా రివాల్వర్‌తో కాల్చి అనంతరం కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచి చంపారు. అనంతరం దుండగులు అక్కడి నుండి పారిపో యారు. వెంకటరత్నం అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు..అయితే గతంలో వెంకటరత్నం ధూల్‌పేట్ లో డబుల్ మర్డర్ కేసులో నిందితుడుగా ఉన్నాడు. ఇతనిపై రౌడీ షీట్ ఉన్నట్లు సమాచారం... ఆర్థిక లావాదేవీల కారణంగా హత్య జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసుకొని ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగించారు.