మైనర్‌ కుమార్తెపై అత్యాచారం.. తండ్రికి 3 జీవిత ఖైదు శిక్షలు

Rape of minor daughter in Kerala.. Father sentenced to 3 life imprisonment. కేరళలోని మలప్పురంలో తన మైనర్ కుమార్తెపై పదేపదే అత్యాచారం చేసి గర్భం దాల్చేలా

By అంజి  Published on  31 Jan 2023 8:43 AM GMT
మైనర్‌ కుమార్తెపై అత్యాచారం.. తండ్రికి 3 జీవిత ఖైదు శిక్షలు

కేరళలోని మలప్పురంలో తన మైనర్ కుమార్తెపై పదేపదే అత్యాచారం చేసి గర్భం దాల్చేలా చేసిన తండ్రికి కేరళ కోర్టు సోమవారం మూడు జీవిత ఖైదులను విధించింది. నిందితుడిపై అత్యాచారం, తీవ్రమైన లైంగిక వేధింపులు, అలాగే భారతీయ శిక్షాస్మృతి,లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద బాధితురాలిని బెదిరించడం వంటి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మంజేరి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి రాజేష్ కె ఆ వ్యక్తిని దోషిగా నిర్ధారించారు. పోక్సో చట్టం కింద ఈ నేరాలకు మూడు జీవిత ఖైదులను విధించారు.

స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ. సోమసుందరన్ ప్రకారం.. ''అతను జీవితకాలం మొత్తం జైలులో ఉండాలని కోర్టు ఆదేశించింది.'' అలాగే 6.6 లక్షల రూపాయల జరిమానా కూడా కోర్టు విధించిందని ఎస్పీపీ తెలిపారు. కేసు వివరాలను తెలియజేస్తూ 2021 మార్చిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తొలి అత్యాచార ఘటన జరిగిందని ఎస్పీపీ తెలిపారు. అప్పటి మైనర్‌ బాలికకు 15 ఏళ్లు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఆన్‌లైన్ తరగతులు వింటూ చదువుకుంటోంది. ఆమె ఒక రోజు ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్న సమయంలో.. తండ్రి ఆమెను తన బెడ్‌రూమ్‌లోకి లాగి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేశాడని ప్రాసిక్యూటర్ తెలిపారు.

బాధితురాలు అభ్యంతరం చెప్పడంతో ఆమె తల్లిని చంపేస్తానని బెదిరించాడని ఎస్పీపీ తెలిపారు. ఓ మదర్సాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నిందితుడు 2021 అక్టోబర్ వరకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన కూతురిపై పలు మార్లు అత్యాచారం చేశాడు. నవంబర్ 2021లో శారీరక తరగతులు పునఃప్రారంభమైనప్పుడు.. బాధితురాలు పాఠశాలకు వెళ్లడం ప్రారంభించింది. ఆ సమయంలో ఆమెకు కొంత కడుపు నొప్పి వచ్చింది. దాని కోసం ఆమెను వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. కానీ పరీక్షల్లో ఏమీ కనుగొనబడలేదు.

జనవరి 2022లో మళ్లీ కడుపునొప్పి రావడంతో ప్రభుత్వ వైద్య కళాశాలకు తీసుకెళ్లినప్పుడు ఆమె తనకు జరిగిన కష్టాలను బయటపెట్టిందని ఎస్‌పీపీ తెలిపారు. అప్పుడు ఆమె గర్భవతి అని తేలింది. అనంతరం కేసు నమోదు చేసి తండ్రిని అరెస్టు చేశారు. బాధితురాలి గర్భం వైద్యపరంగా తొలగించారు. ఆ తర్వాత పిండం, బాలిక, ఆమె తండ్రి డీఎన్‌ఏ నమూనాలను సేకరించారు. డీఎన్‌ఏ విశ్లేషణలో బాలిక తండ్రి నేరస్థుడని రుజువైనట్లు ఎస్పీపీ తెలిపారు. నిందితుడిని దోషిగా నిర్ధారించడంలో డీఎన్‌ఏ ఆధారాలతో పాటు బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలు కీలకంగా ఉన్నాయని తెలిపారు.

"నిందితులు తాత్కాలికంగా బయటకు రాకుండా, బాధితురాలిని లేదా సాక్షులను ప్రభావితం చేయకుండా ఉండేలా విచారణ వేగంగా జరిగింది" అని నేరం నమోదైన వజిక్కడవు పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారి తెలిపారు.

Next Story