మహిళపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం.. గోడౌన్‌కు తీసుకెళ్లి..

జైలు శిక్ష అనుభవిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే మునిరత్నపై అత్యాచారం కేసు నమోదైంది.

By అంజి  Published on  19 Sept 2024 11:44 AM IST
Rape case,  arrest, Karnataka, BJP MLA, Muniratna

మహిళపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం.. గోడౌన్‌కు తీసుకెళ్లి..

వేరే కేసు విషయంలో జైలు శిక్ష అనుభవిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే మునిరత్నపై అత్యాచారం కేసు నమోదైంది. మహిళా సామాజిక కార్యకర్తపై అత్యాచారం చేసిన కేసులో కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు.

ఓ కాంట్రాక్టర్‌పై కుల దురభిమానాలు, బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఎమ్మెల్యే మునిరథ ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. మునిరత్న బెయిల్ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు తన నిర్ణయాన్ని గురువారానికి రిజర్వ్ చేసింది.

ఎమ్మెల్యేకు బెయిల్ వస్తే సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే అత్యాచారం కేసులో మరోసారి అరెస్ట్ చేస్తారని పోలీసు వర్గాలు ధృవీకరించాయి. కోర్టు బెయిల్ నిరాకరిస్తే, కేసులో బాడీ వారెంట్‌పై పోలీసు కస్టడీకి తీసుకుంటారు.

మహిళా సామాజిక కార్యకర్త ఫిర్యాదు మేరకు రామనగర జిల్లా కగ్గలిపుర పోలీసులు మునిరత్నపై గురువారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తనకు ప్రజా జీవితంలో మునిరత్న పరిచయమయ్యాడని ఫిర్యాదుదారు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొబైల్ ద్వారా ఆమెకు కాల్స్ చేస్తూ సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఆమెను ముత్యాలనగర్‌లోని ఓ గోడౌన్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

విషయం బయటకు వస్తే తనను చంపేస్తానని నిందితుడు బెదిరించాడని ఫిర్యాదుదారు పేర్కొంది. వివిధ ప్రైవేట్ రిసార్ట్స్‌లోని వ్యక్తులను హనీట్రాప్‌కు బలవంతం చేశారని బాధితురాలు పేర్కొంది. 'హనీ ట్రాప్‌లు వేయమని బీజేపీ ఎమ్మెల్యే నన్ను బలవంతం చేశారు. ఈ పని చేయమని, లేదంటో చంపేస్తానని బెదిరించాడు' అని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు వర్గాలు ధృవీకరించాయి.

కగ్గలిపుర పోలీసులు అతని సహచరులు ఆరుగురిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. విజయ్‌కుమార్, కిరణ్, లోహిత్, మంజునాథ్, లోకితో పాటు మరో ఇద్దరు ఉన్నారు. బాధితురాలు బుధవారం అర్థరాత్రి పోలీసులను ఆశ్రయించి డిప్యూటీ ఎస్పీ దినకర్ శెట్టి ఎదుట తన వాంగ్మూలాలను నమోదు చేసింది. పోలీసులు గురువారం తెల్లవారుజామున ఐపీసీ సెక్షన్లు 354 (ఎ), 354 (సి), 308, 406, 384, 120 (బి), 504, 506 , 149 కింద కేసు నమోదు చేశారు. రాజరాజేశ్వరి నగర్ ఎమ్మెల్యేపై ఐటీ చట్టం, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన గతంలోనే జరగడంతో ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Next Story