ఆహారం పెట్టేందుకు వెళ్లిన.. కన్న తల్లిపై కొడుకు అత్యాచారం.. ఆ తర్వాత

Rape attempt on mother by son in Uttarakhand. తల్లీ కొడుకుల బంధానికి మచ్చ తెచ్చే ఘటన ఇది. కామ దాహంతో కన్న తల్లి(58)పైనే కన్నేశాడో ఓ

By అంజి  Published on  27 Dec 2022 8:43 AM GMT
ఆహారం పెట్టేందుకు వెళ్లిన.. కన్న తల్లిపై కొడుకు అత్యాచారం.. ఆ తర్వాత

తల్లీ కొడుకుల బంధానికి మచ్చ తెచ్చే ఘటన ఇది. కామ దాహంతో కన్న తల్లి(58)పైనే కన్నేశాడో ఓ యువకుడు. సొంత తల్లితో తప్పుగా ప్రవర్తించాడు. కన్న తల్లి అని చూడకుండా.. ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు. అడ్డొచ్చిన తండ్రిని కూడా కొట్టాడు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని పౌరీ జిల్లాలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన పంకజ్‌ అనే యువకుడు కొన్ఇన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. డిసెంబర్‌ 25వ తేదీన తల్లి కుమారుడికి ఆహారం పెట్టేందుకు వెళ్లింది. అదే సమయంలో తల్లిపై కొడుకు అత్యాచారానికి పాల్పడ్డాడు.

తల్లిని చంపేస్తానని బెదిరించాడు. అడ్డొచ్చిన తండ్రిని కొట్టాడు. ఆ తర్వాత ఈ మొత్తం విషయాన్ని తల్లి రోహతక్‌లో ఉంటున్న తన కూతురికి చెప్పింది. ఆ వెంటనే తల్లీ కూతురు కలిసి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనుచితంగా ప్రవర్తించడం, చంపేస్తానని బెదిరించడం, దాడి చేయడం వంటి సెక్షన్ల కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని ఖండూసైన్‌ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల్లో తల్లిపై అత్యాచారం జరిగినట్లు నిర్దారణ అయ్యింది.

Next Story