ఇంత ఘోరమా.. మైనర్ పై 17 మంది ఐదు నెలలుగా అత్యాచారం!

Rape and Trafficking of a 15-yr-old girl in Karnataka. కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. ప్రతిరోజూ మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.

By Medi Samrat  Published on  2 Feb 2021 3:22 PM GMT
Rape and Trafficking of 15-yr-old girl in Karnataka

కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు చేస్తున్నా కామాంధులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. తాజాగా కర్ణాటకలో ఓ 15 ఏళ్ల అమ్మాయిపై 17 మంది కామాంధులు ఐదు నెలలుగా మార్చి మార్చి అత్యాచారం చేస్తూ వచ్చారు. ఈ దారుణ ఘటనపై చిక్కామంగళూరు జిల్లా శ్రీంగేరి పోలీసులకు జిల్లా బాలల సంక్షేమ సంఘం ఛైర్మన్ ఫిర్యాదు చేశారు.

కాగా, ఆ బాలిక స్టోన్ క్రషింగ్ యూనిట్ లో పని చేస్తుంది. మొదట బాలికపై బస్సు డ్రైవరు గిరీష్ అత్యాచారం చేశాడు. బస్సు డ్రైవరు అందించిన సమాచారంతో అభి అనే మరో యువకుడు బాలికపై అత్యాచారం చేసి ఆమె అశ్లీల వీడియోలు, ఫొటోలు తీసుకున్నాడు. ఆ తర్వాత వీడియోలు, ఫోటోలు బయట పెడతాం అని బెదిరిస్తూ అతని స్నేహితులు అత్యాచారం చేస్తూ వచ్చారు.

బాధిత బాలిక తల్లి మరణించడంతో ఆమె అత్త ఇంట్లో నివాసముంటోంది. అయితే ఆ బాలిక అత్తతో తన బాధ చెప్పినా పట్టించుకోలేదు. దాంతో ఆమెను కూడా నేరస్తురాలిగా పరిగణించారు పోలీసులు. ఈ ఘటనలో నిందితులైన అభి, గిరీష్, వికాస్, మణికంఠ, సంపత్, అశ్వత్ గౌడ, యోగీష్, ఎంజీఆర్ క్రషర్ యజమాని, బాధిత బాలిక అత్తలను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 201, 370, 376(3), 376(ఎన్), పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.


Next Story
Share it