హైదరాబాద్‌: ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లీకొడుకు దుర్మరణం

Rangareddy Road accident... రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌ పరిధిలోని రాగన్నగూడ వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

By సుభాష్  Published on  13 Nov 2020 9:50 AM IST
హైదరాబాద్‌: ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లీకొడుకు దుర్మరణం

రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌ పరిధిలోని రాగన్నగూడ వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ నుంచి ఇబ్రహీపట్నం వైపు అతివేగంగా వెళ్తున్న టాటా సఫారీ కారు యమహాఫాసినో బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యమహాపై ఉన్న తల్లీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

మృతులు రాగన్నగూడలోని జీవీఆర్‌ కాలనీకి చెందిన సంరెడ్డి ప్రదీప్‌రెడ్డి (20), చంద్రకళ (45)గా గుర్తించారు పో లీసులు. అలాగే కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించగా, వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story