ఘోరం.. బంధువుల‌తో భార్య పై అత్యాచారం చేయించిన భ‌ర్త‌

Rajasthan man gets wife molested by relatives.ఇటీవ‌ల కాలంలో మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలుగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 April 2022 12:34 PM IST
ఘోరం.. బంధువుల‌తో భార్య పై అత్యాచారం చేయించిన భ‌ర్త‌

ఇటీవ‌ల కాలంలో మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. ధ‌న‌మేరా అన్నింటికీ మూలం అని అంటున్నారు కొంద‌రు. డ‌బ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. భార్య క‌ట్నం తీసుకురాలేద‌ని ఓ భ‌ర్త దారుణానికి ఒడిగ‌ట్టాడు. ఏ భ‌ర్త చేయ‌కూడ‌ని ప‌ని చేశాడు. త‌న ఇద్ద‌రు బంధువుల‌తో భార్య‌పై అత్యాచారం చేయించాడు. ఆ ఘ‌ట‌న మొత్తాన్ని వీడియో తీశాడు. ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ దారుణ ఘ‌టన రాజ‌స్థాన్‌లో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెలితే.. భరత్ పూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కి 2019లో హర్యానాకు చెందిన మహిళతో వివాహం జ‌రిగింది. పెళ్లి స‌మ‌యంలో అత్తింటి వారు రూ.1.5ల‌క్ష‌ల క‌ట్నం ఇస్తామ‌ని ఇవ్వ‌లేదు. దీంతో అత్తింటి వారు ఆమ‌హిళ‌ను నిత్యం క‌ట్నం కోసం వేదించేవారు. ఈ బాద‌లు భ‌రించ‌లేని ఆ మ‌హిళ పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే భార్య వ‌ద్ద‌కు వెళ్లిన భ‌ర్త.. ఆమెకు మాయ‌మాట‌లు చెప్పి తిరిగి ఇంటికి తీసుకువ‌చ్చాడు.

అనంత‌రం ఇద్ద‌రు స‌మీప బంధువుల‌ను పిలిచి భార్య‌పై అత్యాచారం చేయించాడు. ఈ ఘ‌ట‌న మొత్తాన్ని అత‌డే ద‌గ్గ‌రుండి వీడియో తీశాడు. ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి డ‌బ్బు సంపాదించుకుంటాన‌ని చెప్పి అప్‌లోడ్ చేశాడ‌ని బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story