నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకుందని కూతురిని చంపి.. మృతదేహాన్ని తగులబెట్టి..

24 ఏళ్ల యువతి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ఆమె కుటుంబ సభ్యులే.. ఆమెను అతి కిరాతకంగా హత్య చేశారు.

By అంజి  Published on  5 July 2024 12:02 PM IST
Rajasthan, marriage, Crime

నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకుందని కూతురిని చంపి.. మృతదేహాన్ని తగులబెట్టి..

రాజస్థాన్‌లోని ఝలావర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. 24 ఏళ్ల యువతి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ఆమె కుటుంబ సభ్యులే.. ఆమెను అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. భర్త ముందే మహిళను కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారు. తరువాత ఆమెను చంపి, ఆమె మృతదేహానికి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో మహిళ తన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా రవి భీల్‌ను వివాహం చేసుకున్నట్లు తేలింది.

తమ కుటుంబ సభ్యుల ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకు దంపతులు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలోని బ్యాంకుకు దంపతులు వస్తున్నారని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఆ తర్వాత మహిళ అపహరణకు గురైంది. ఫిర్యాదు చేసేందుకు భర్త పోలీసులను ఆశ్రయించారు. అయితే అప్పటికే మహిళను చంపి శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి మహిళ శరీరం 80 శాతానికి పైగా కాలిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పరారయ్యారు. తదుపరి విచారణ కోసం మహిళ కాలిన అవశేషాలను ఫోరెన్సిక్‌కు పంపించారు.

Next Story