పంజాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న అమన్‌దీప్ కౌర్ 17 గ్రాముల హెరాయిన్‌తో పట్టుబడింది. ఆమె గురించి ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. చండీగఢ్ నుండి వచ్చిన ప్రత్యేక బృందం కెనాల్ పోలీస్ స్టేషన్ లోపల పోలీసు రిమాండ్ సమయంలో అమన్‌దీప్ కౌర్‌ను రెండు గంటలకు పైగా విచారించింది. నిందితురాలు ఏ ఐపీఎస్ అధికారితో సంబంధం కలిగి ఉందనే విషయమై కూడా సదరు బృందం లోతుగా దర్యాప్తు చేస్తోంది.
అక్రమంగా సంపాదించిన డబ్బుతో అమన్ దీప్ జల్సాలు చేయడం మొదలుపెట్టింది. విచారణలో నిందితురాలు తన సోదరుడు, ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద జిల్లాలో ఖరీదైన ప్లాట్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. థార్, బులెట్ లాంటి ఎన్నో వాహనాలను కొనిచ్చింది. నిందితురాలి దగ్గర చాలా బంగారు ఆభరణాలు ఉన్నాయి. వారం క్రితమే ఆమె బంగారు చెవి ఆభరణాలు కొనుక్కుంది. ఆమె దగ్గర దాదాపు రెండు లక్షల విలువైన ఖరీదైన గడియారం, 85 వేల రూపాయల విలువైన సన్ గ్లాసెస్ ఉన్నాయి. ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ చేసేటప్పుడు వాటిని ధరించేది.