ఆ విషయంలో గొడవ.. సెక్స్ వర్కర్‌పై షేవింగ్ బ్లేడ్‌తో దాడి
Pune man arrested for attacking a sex worker after an argument. మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పూణే నగరంలోని బుద్వార్ పేటలోని రెడ్ లైట్ ఏరియాలో డబ్బు విషయంలో
By అంజి Published on
14 Feb 2022 1:23 PM GMT

మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పూణే నగరంలోని బుద్వార్ పేటలోని రెడ్ లైట్ ఏరియాలో డబ్బు విషయంలో వచ్చిన విభేదాల కారణంగా అతనితో వెళ్లేందుకు నిరాకరించిన 35 ఏళ్ల సెక్స్ వర్కర్‌పై దాడి చేసినందుకు 40 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. రాజప్ప సిద్ధలింగప్ప అనే నిందితుడు షేవింగ్ బ్లేడ్‌తో ఆమెపై దాడి చేసి ఛాతీ కింద గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. అతడిపై పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సేవకు చెల్లించాల్సిన డబ్బు విషయంలో ఫిర్యాదుదారుతో నిందితుడు వాగ్వాదానికి దిగడంతో ఆమె అతనితో వెళ్లేందుకు నిరాకరించిందని పోలీసులు తెలిపారు. దీంతో కోపోద్రిక్తుడైన నిందితుడు షేవింగ్ బ్లేడ్‌తో ఆమెపై దాడి చేసి ఛాతీ కింద తీవ్రంగా గాయపరిచాడని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫరస్ఖానా పోలీస్ స్టేషన్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఐపిసి సెక్షన్ 307, 506 ప్రకారం హత్య అనుమానంతో నిందితుడిని పట్టుకుంది. మహిళను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు.
Next Story