ఆ జంట ప్రాణాలు పోవడానికి కారణం ఎవరు.?

తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇచ్చే ముందు కాస్త ఆలోచించాలి. చిన్న చిన్న పిల్లలకు బైక్ లు, కార్లు ఇచ్చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఎప్పుడు.. ఏమి జరుగుతుందో ఊహించలేరు.

By M.S.R  Published on  20 May 2024 5:17 AM GMT
ఆ జంట ప్రాణాలు పోవడానికి కారణం ఎవరు.?

తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇచ్చే ముందు కాస్త ఆలోచించాలి. చిన్న చిన్న పిల్లలకు బైక్ లు, కార్లు ఇచ్చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఎప్పుడు.. ఏమి జరుగుతుందో ఊహించలేరు. కొన్ని కొన్ని సార్లు ఆ పిల్లలు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా కొందరి ప్రాణాలు కూడా తీస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. 17 ఏళ్ల మైనర్ కారుతో దూసుకురావడంతో ఓ జంట ప్రాణాలు పోయాయి. ఈ ఘటనకు కారణం ఆ పిల్లవాడా? ఆ పిల్లవాడికి కారును ఇచ్చిన తల్లిదండ్రులదా?

పూణెలో శనివారం సాయంత్రం వేగంగా వచ్చిన పోర్షే కారు.. ఓ బైక్‌ను ఢీకొనడంతో దంపతులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కారును నగరంలో ప్రముఖ బిల్డర్ కొడుకు నడుపుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అతడి వయసు 17 సంవత్సరాలు. పోర్షేలో ఉన్న మైనర్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్‌ను అదుపులోకి తీసుకున్న 14 గంటల్లోనే జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

పూణెలోని కోరేగావ్ పార్క్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కల్యాణి నగర్‌లోని ఓ పబ్‌లో పార్టీ ముగించుకుని స్నేహితుల బృందం మోటార్‌బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా.. కళ్యాణి నగర్ జంక్షన్ వద్దకు వచ్చినప్పుడు, పోర్షే నడుపుతున్న మైనర్ మోటార్ సైకిళ్లలో ఒకదానిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆ బైక్ మీద ఉన్న జంట అక్కడికక్కడే మరణించారని ఎఫ్ఐఆర్ పేర్కొంది. ప్రమాదానికి గురైన కారులో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ను కొందరు వ్యక్తులు కొట్టడం కనిపించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. బాధితులు రాజస్థాన్‌కు చెందిన అనిస్ దుధియా, అతని భార్య అశ్విని కోస్టాగా గుర్తించినట్లు పూణే అదనపు పోలీసు కమిషనర్ (ACP) మనోజ్ పాటిల్ తెలిపారు. కోస్టా అక్కడికక్కడే మృతి చెందగా, దుధియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోర్షే కారు గంటకు 200-240 కిలోమీటర్ల వేగంతో దూసుకు వచ్చిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.

Next Story