మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం మాచారం వద్ద శుక్రవారం ఉదయం వంతెనపై లారీని వెనుక నుండి ఢీకొన్న ప్రమాదంలో ఒక ప్రైవేట్ బస్సు డ్రైవర్, ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. కడప నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఉదయం 6 గంటల ప్రాంతంలో లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను బస్సు డ్రైవర్, కూకట్‌పల్లి నివాసితులు లక్ష్మీదేవి, రాధికగా గుర్తించారు. ప్రమాద ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.