తరగతి గదిలో మైనర్‌ బాలికతో టీచర్‌ అసభ్యకర ప్రవర్తన.. చిన్నారి అరుపులు విని

Primary school teacher held for misbehaving with minor in Hyderabad. ఫలక్‌నుమాలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న అష్వాక్ అహ్మద్ అనే వ్యక్తి ఉదయం పాఠశాలకు వచ్చిన తొమ్మిదేళ్ల బాలికను

By అంజి  Published on  5 Feb 2022 10:54 AM IST
తరగతి గదిలో మైనర్‌ బాలికతో టీచర్‌ అసభ్యకర ప్రవర్తన.. చిన్నారి అరుపులు విని

నేటి సమాజంలో మహిళలు, చిన్నారులకు రక్షణ కరువైపోయింది. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. సందు దొరికితే చాలు అన్నట్లుగా మానవ మృగాలు వ్యవహారిస్తున్నాయి. హైదరాబాద్‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఫలక్‌నుమా ప్రాంతంలో గల ఓ పాఠశాలలో మైనర్‌ బాలికతో అసభ్యంగా ప్రవర్తించినందుకు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.

ఫలక్‌నుమాలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న అష్వాక్ అహ్మద్ అనే వ్యక్తి ఉదయం పాఠశాలకు వచ్చాడు. అదే సమయంలో పాఠశాలకు వచ్చిన తొమ్మిదేళ్ల బాలికను పట్టుకుని ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి తీసుకెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. చిన్నారి అరుపులు విన్న కొందరు సిబ్బంది చిన్నారిని రక్షించారు. అనంతరం ఆ ఉపాధ్యాయుడిని పోలీసులకు అప్పగించారు. అయితే టీచర్‌కు కొన్ని మానసిక సమస్యలు ఉన్నాయని స్కూల్ యాజమాన్యం పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story