ఏడు నెలల గర్భవతి అని కూడా చూడలేదు.. పెళ్లి చేసుకోమని అడిగిందని చంపేశాడు

ఢిల్లీకి చెందిన ఓ యువతిని ఆమె బాయ్‌ఫ్రెండ్ హత్య చేసి పూడ్చిపెట్టాడు.

By Kalasani Durgapraveen  Published on  26 Oct 2024 2:36 PM IST
ఏడు నెలల గర్భవతి అని కూడా చూడలేదు.. పెళ్లి చేసుకోమని అడిగిందని చంపేశాడు

ఢిల్లీకి చెందిన ఓ యువతిని ఆమె బాయ్‌ఫ్రెండ్ హత్య చేసి పూడ్చిపెట్టాడు. అతడికి మరో ఇద్దరు సహాయం చేశారు. ఆమె గర్భవతి అవ్వడంతో అబార్షన్ చేయించాలని అనుకున్నాడు బాయ్ ఫ్రెండ్. అందుకు ఆమె ఒప్పుకోలేదు, వివాహం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

19 సంవత్సరాల వయస్సు ఉన్న పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయ్‌లో నివసించే సోనీని చంపేశారు. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌, ఆమెకు 6,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తన ప్రియుడు సంజు అకా సలీమ్‌తో కలిసి అనేక ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసింది. ఆమె గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో సలీమ్ కూడా పలు పోస్ట్లు పెట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

సోనీ ఏడు నెలల గర్భిణి. సలీమ్‌ను పెళ్లి చేసుకోవాలని కోరుతూ ఉండగా, అతను అందుకు సిద్ధంగా లేనని తప్పించుకుంటూ ఉండేవాడు. దీంతో ఆమెను అబార్షన్ చేసుకోవాలని కోరినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ విషయమై తరచూ గొడవ పడుతూ ఉండేవారు. సలీమ్, అతని ఇద్దరు సహాయకులు సోనీని హర్యానాలోని రోహ్‌తక్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెను చంపి, ఆమె మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. సోనీ ఆచూకీ తెలుసుకోడానికి ప్రయత్నించగా ఈ హత్య బయట పడింది. సలీమ్‌తో పాటు అతని సహాయకుల్లో ఒకరిని అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని, అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.


Next Story