'సందీప్ రెడ్డితో ముదిరిన వివాదం.. 'స్పిరిట్' నుంచి తప్ప్పుకున్న ప్రకాష్ రాజ్' అంటూ పలు కథనాలు అటు మీడియా లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ నుంచి ఆయనను తొలగించారని, సెట్‌లో దర్శకుడితో గొడవ జరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని కథనాలు వచ్చాయి.
అయితే ఈ పుకార్లపై ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘విషపూరితమైన నకిలీ వార్తలు ప్రచారం చేసే వారందరికీ.. స్పిరిట్ సినిమా గురించి ఒక మాట. ఆ సినిమాలో నా సన్నివేశాల చిత్రీకరణ ఇంకా మొదలే కాలేదు. అప్పుడే మీరు మీ వాట్సాప్ ఫ్యాక్టరీల ద్వారా లేనిపోని కథలు అల్లి ప్రచారం చేస్తున్నారు. వెళ్లి మీ పని చూసుకోండి’’ అంటూ సమాధానమిచ్చారు.