బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్.. 11 మంది సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లపై కేసులు న‌మోదు

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, యాక్ట‌ర్లు, సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లపై కేసులు నమోదయ్యాయి.

By Medi Samrat  Published on  17 March 2025 7:50 PM IST
బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్.. 11 మంది సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లపై కేసులు న‌మోదు

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, యాక్ట‌ర్లు, సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లపై కేసులు నమోదయ్యాయి. వీరంతా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ డబ్బులు తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. యూట్యూబ‌ర్‌ హర్షసాయి, న‌టి, యాంక‌ర్ విష్ణుప్రియ, జ‌బ‌ర్ధ‌స్త్‌ రీతు చౌదరి, యూట్యూబ‌ర్‌ టేస్టీ తేజ, న‌టి సురేఖ వాణి కూతురు సుప్రీత, ఇమ్రాన్ ఖాన్ (పరేషన్ బాయ్స్), కిరణ్‌ గౌడ్‌తో పాటు మొత్తం 11 మందిపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు నమోదయ్యాయి. వారిపై 318(4) BNS, 3, 3(A), 4 TSGA, 66D ITA Act-2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లు ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ బారిన పడి అమాయ‌క యువ‌త‌ ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో వీరిపై ఐపీఎస్ అధికారి, టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి.. అమాయకులకు నష్టం చేకూరుస్తున్నారని అన్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని ఇటీవల సజ్జనార్ హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలోనే పంజాగుట్ట పోలీసులు 11 మంది యూట్యూబర్లపై కేసులు నమోదు చేశారు.

Next Story