హన్మకొండలో దారుణం.. హాస్టల్‌లో యువతిపై అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్‌

Police book two men, one woman in rape case in Hanamkonda. ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న యువతిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

By అంజి  Published on  2 Dec 2022 11:21 AM IST
హన్మకొండలో దారుణం.. హాస్టల్‌లో యువతిపై అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్‌

ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న యువతిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరో వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోవాలని నెల రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశాడు. వేధింపులు తట్టుకోలేక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన తెలంగాణలోని హన్మకొండలో జరిగింది. హాస్టల్‌లో ఉంటున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో మహిళతో సహా ముగ్గురిపై హన్మకొండ పోలీసులు బుధవారం అత్యాచారం కేసు నమోదు చేశారు.

బాలసముద్రంలో లేడీస్ హాస్టల్ నడుపుతున్న ముగ్గురు నిందితులలో ఒకరైన వి శోభ.. తన హాస్టల్‌లో ఉంటున్న యువతిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించడంతో ఈ భయంకరమైన చర్య ప్రారంభమైంది. శోభ.. యువతిని తన బంధువుల్లో ఒకరైన వి విజయ్ కుమార్ (నిందితుడు)తో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేసింది. అతను ఒక నెల పాటు బాలికను చిత్రహింసలకు గురి చేసి, శివతో సంబంధాలు పెట్టుకోకపోతే వీడియోలు, చిత్రాలను లీక్ చేస్తానని ఆమెను బెదిరించాడు.

సిద్దిపేట జిల్లాకు చెందిన 23 ఏళ్ల న్యాయ విద్యార్థినిని.. నిందితులు పదే పదే ఒత్తిడి చేయడంతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయ్ కుమార్, శివ తనపై పలుమార్లు అత్యాచారం చేశారని యువతి పోలీసులకు తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద, ఇండియన్ పీనల్ కోర్టు (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసును సిరీయస్‌గా తీసుకున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Next Story