ఈ వీడియో చూస్తే.. ఇక జ‌న్మ‌లో చ‌పాతీలు తిన‌రు.. ఛీ ఇదేం గలీజు పనిరా నాయనా

Police arrested the accused whose video of spitting on rotis in a Tandoor at Wedding. ఓ పెళ్లి విందులో ఏర్పాటు చేసిన చ‌పాతీల్లో.. ఆ చపాతీలు త‌యారు చేసే వ్య‌క్తి ప్ర‌తీ చ‌పాతీపై ఉమ్మి వేసి త‌యారు చేశాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Feb 2021 12:07 PM GMT
Police arrested the accused whose video of spitting on rotis in a Tandoor at Wedding.

పెళ్లింటే చాలా మందికి గుర్తొచ్చేది వింధు భోజ‌న‌మే. పెళ్లికి వ‌చ్చిన వారికి ర‌క‌రకాల ప‌దార్థాల‌తో వ‌డ్డిస్తారు. కానీ ఇప్పుడు చెప్పేది వింటే ఇక‌పై పెళ్లిలో భోజనం చేయాలంటే ఒక‌టికి ప‌ది సార్లు ఆలోచిస్తారు. ఓ పెళ్లి విందులో ఏర్పాటు చేసిన చ‌పాతీల్లో.. ఆ చపాతీలు త‌యారు చేసే వ్య‌క్తి ప్ర‌తీ చ‌పాతీపై ఉమ్మి వేసి త‌యారు చేశాడు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ప్ర‌స్తుతం ఈ వీడియో బ‌య‌ట‌ప‌డ‌గా.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మీరట్‌లో ఓ పెళ్లితంతు ఘనంగా జరిగింది. అక్కడికి వచ్చిన అతిథుల కోసం ఓ వ్యక్తి తందూరీ రోటీలు త‌యారు చేస్తూ ఉమ్మి వేస్తున్నాడు. చ‌పాతీల‌ను చాక చాక్యంగా తిప్పుతూ ఒకదానిమీద మరొకటి పేర్చి ప్ర‌తీ చ‌పాతీపై ఉమ్మి వేశాడు. అత‌డు చేసిన ప‌నిని ఓ వ్య‌క్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇంకేముంది.. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై ద‌ర్యాప్తు చేప‌ట్టిన మీర‌ట్ పోలీసులు.. ఈ ప‌నిని మీర‌ట్ కు చెందిన సోహైల్ చేసిన‌ట్లు గుర్తించారు. వెంట‌నే అత‌డిని అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. తానెప్పుడు చ‌పాతీలు చేయ‌లేద‌ని.. త‌న‌కేమి తెలియ‌న్నాడు. వీడియో చూపించి అడుగ‌గా.. ఆ వీడియోలో ఉన్న‌ది తాను కాద‌ని అంటున్నాడు. దీంతో ఆ వ్య‌క్తి మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు పోలీసులు భావిస్తున్నారు.


ఈ వీడియో చూసిన వారంతా.. అత‌డిని తిట్టి పోస్తున్నారు. ఛీ ఇదేం గలీజు పనిరా నాయనా అని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పాపాం ఆ పెళ్లిలో వాళ్లు ఈ విష‌యం తెలీక తిన్నా.. ప్ర‌స్తుతం ఈ వీడియో చూసిన త‌రువాత వారి ప‌రిస్థితి ఎంటో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Next Story
Share it