దారుణం.. బాలికపై సర్కార్‌ బడి ప్యూన్‌ అత్యాచారం

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. 10 ఏళ్ల బాలికపై పాఠశాల ప్యూన్‌ అత్యాచారానికి

By అంజి  Published on  24 March 2023 9:35 AM IST
Govt school peon, Delhi, Crime news

దారుణం.. బాలికపై సర్కార్‌ బడి ప్యూన్‌ అత్యాచారం

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. 10 ఏళ్ల బాలికపై పాఠశాల ప్యూన్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికపై అత్యాచారం చేసినందుకు ఎంసీడీ పాఠశాలకు చెందిన 54 ఏళ్ల ప్యూన్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌కు చెందిన అజయ్ అనే నిందితుడు మైనర్ బాలికకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. 10 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపులు జరిగినట్లు మార్చి 14న ఎంసీడీ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు.

నిందితుడు విద్యార్థినిని పాఠశాల నుంచి గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లి, గుర్తు తెలియని మత్తు మందు ఇచ్చి, ఆపై తన సహచరులతో కలిసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఆరోపించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఎల్‌బీఎస్‌ ఆస్పత్రికి తరలించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మరోవైపు పోలీసులు పీఎస్ గాజీపూర్‌లో ఐపీసీ 363/328/376డి/506, పోక్సో చట్టం 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

పోలీసులకు పట్టుబడిన నిందితుడు ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో శాశ్వత నివాసి, గత 10 సంవత్సరాలుగా ఎంసీడీ పాఠశాలలో ప్యూన్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ మిగిలిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేసు తదుపరి విచారణ జరుగుతోంది.

Next Story