Hyderabad: శృంగారానికి నిరాకరించిందని.. భార్యను గొంతు నులిమి చంపిన భర్త

హైదరాబాద్‌ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. తన రెండవ బిడ్డకు జన్మనిచ్చిన ఒక నెల తర్వాత, తనతో "శృంగారం చేయడానికి

By అంజి  Published on  2 Jun 2023 8:00 AM IST
Hyderabad, Crime news, man kills wife

Hyderabad: శృంగారానికి నిరాకరించిందని.. భార్యను గొంతు నులిమి చంపిన భర్త

హైదరాబాద్‌ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. తన రెండవ బిడ్డకు జన్మనిచ్చిన ఒక నెల తర్వాత, తనతో "శృంగారం చేయడానికి నిరాకరించినందుకు" తన భార్యను హత్య చేసిన ఆరోపణలపై 24 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని 24 ఏళ్ల జె తరుణ్‌గా గుర్తించారు. ఈ హత్య మే 20న జరగ్గా.. 10 రోజుల తర్వాత పోలీసులు కేసును ఛేదించారు. పోలీసులు అతడిని క్షుణ్ణంగా విచారించగా నేరం ఒప్పుకున్నాడని, పోస్టుమార్టం రిపోర్టులో మరణానికి గల కారణాలేంటని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 20 రాత్రి ఆ వ్యక్తి తన భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఆమె ఒక నెల క్రితం వారి రెండవ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో శృంగారానికి నిరాకరించింది. ఈ కారణంగా కోపోద్రిక్తుడైన అతడు ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లు సమాచారం. దీంతో నిందితుడు భయాందోళనకు గురై బంధువులకు సమాచారం ఇచ్చాడు. వారు మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లారు, అయితే అక్కడ వైద్యులు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు.

మహిళ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రాథమిక దర్యాప్తులో మహిళ గొంతుపై కొన్ని గోరు గుర్తులను పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడని సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లోని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పోలీసుల విచారణలో.. ఆ వ్యక్తి తనతో "శృంగారానికి నిరాకరించిన" కారణంగా తన భార్యను చంపినట్లు అంగీకరించినట్లు అధికారి తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక కూడా మరణానికి కారణాన్ని నిర్ధారించిందని, తరువాత నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు ఆయన తెలిపారు.

Next Story