ఎక్స్‌ప్రెస్ హైవేపై శృంగారం..బీజేపీ నేత అరెస్ట్
ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై ఓ మహిళతో శృంగారం చేసిన బీజేపీ నేత మనోహర్ లాల్ ధకాడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik
ఎక్స్‌ప్రెస్ హైవేపై శృంగారం..బీజేపీ నేత అరెస్ట్
ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై ఓ మహిళతో శృంగారం చేసిన బీజేపీ నేత మనోహర్ లాల్ ధకాడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని మాండ్‌సౌర్‌కు చెందిన స్థానిక బీజేపీ నేత మనోహర్ లాల్ ధకాడ్ హైవే పక్కనే మహిళతో చేసిన పాడు పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో పొలిటికల్‌గా పెను దుమారం లేపింది. బీజేపీ నేతపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక ఈ ఘటనపై మాండ్‌సౌర్ జిల్లాలోని భన్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా నిన్న మనోహర్ లాల్ ధకడ్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను జైలుకు తరలించారు.
ప్రజలకు ఇబ్బంది కలిగించడం, రోడ్డుపై అసాంఘీక కార్యకలాపాల నేపథ్యంలో సెక్షన్లు 296, 285, మరియు 3(5) కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అంతే కాకుండా హైవేపై ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోను లీక్ చేసింది ఎవరు, వైరల్ ఎందుకు చేశారు అనేదానిపై సైతం పోలీసులు విచారిస్తున్నారు. వీడియోలోని మహిళపైనా కేసు నమోదు చేసిననట్టు తెలిపారు. ఆమెను అరెస్ట్ చేయాలంటే ముందు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని తెలిపారు. మరోవైపు బీజేపీ ధకాడ్‌పై కావాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తోంది. కాగా మనోహర్ భార్య పంచాయతీ వార్డు సభ్యురాలిగా ఉన్నారు. పార్టీపరమైన చర్యలు తీసుకుంటామని బీజేపీ ప్రకటించింది.
BJP leader Manohar Lal Dhakad, who publicly had sex with a woman on the Delhi-Mumbai Expressway claiming to test the road's strength, has been arrested.#manoharlaldhakad #manohardhakad #manoharlal #BJP4ViksitBharat #BJP #bjpneta #BJPLeader #HighWay #BJPGovernment pic.twitter.com/QmE9thAAta
— Bagmaru Munawwar (@BagmaruSpeaks) May 25, 2025