ప్రేయర్ పేరుతో చర్చి పాస్టర్ అరాచకం
Pastor assaulted minor girls in Kurnool.కఠిన చట్టాలు ఎన్ని ఉన్నప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు.
By తోట వంశీ కుమార్ Published on
13 Nov 2021 7:32 AM GMT

కఠిన చట్టాలు ఎన్ని ఉన్నప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రేయర్ పేరుతో ఓ చర్చి పాస్టర్ మైనర్ బాలికలపై లైంగిక వేదింపులకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.
చాగలమర్రి మండలంలో పాస్టర్ ప్రసన్నకుమార్ చర్చిని నిర్వహిస్తున్నాడు. తల్లిదండ్రులు పనికి వెళ్లిన తరువాత ప్రేయర్ పేరుతో ఇద్దరు మైనర్ బాలికలను చర్చిలోకి తీసుకువెళ్లి లైంగిక వేదింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాదిత బాలికలు తల్లిదండ్రులకు చెప్పారు. వారు పోలీసులను ఆశ్రయించారు. అదే సమయంలో ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పాస్టర్ ప్రసన్నకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కాగా.. ఇలాంటి ఘటననే తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది. చర్చిలో పియానో వాయించే వ్యక్తి 19 మందిని మోసం చేశాడు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story