డబ్బుతో అమ్మాయిలకు వల.. ఏకంగా 5వేల మంది విక్రయం.. సంచలన నిజాలు.!
Pannalal mahato accused of smuggling more than 5000 girls now arrested. జార్ఖండ్‌కు చెందిన మానవ అక్రమ రవాణాదారుని అరెస్టు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆదివారం తెలియజేసింది.
By అంజి Published on 13 Dec 2021 7:35 AM ISTమనీలాండరింగ్ విచారణలో భాగంగా జార్ఖండ్‌కు చెందిన మానవ అక్రమ రవాణాదారుని అరెస్టు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆదివారం తెలియజేసింది. పన్నా లాల్ మహ్తో అలియాస్ గంజు అనే వ్యక్తి 5000 మందికి పైగా అక్రమ రవాణా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని కేంద్ర ఏజెన్సీ తెలిపింది. జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలు నుంచి మహ్తోను అరెస్టు చేసినట్లు ఈడీ ఇంకా పేర్కొంది, అరెస్టు తర్వాత, ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం (పీఎంఎల్‌ఏ) కోర్టు, డిసెంబర్ 10 న అతనికి ఐదు రోజులు కస్టడీకి పంపింది. "మహ్తో జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా నివాసి, ఈ నేరాలకు సంబంధించి 2006, 2015లో రాష్ట్ర పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
అయితే అతను ఈ కేసులన్నింటిలో బెయిల్ పొందగలిగాడు"అని ఈడీ వివరించింది. "కిడ్నాప్, ట్రాఫికింగ్ మొదలైన నేరాలకు సంబంధించి భారత శిక్షాస్మృతి (IPC)లోని వివిధ సెక్షన్ల కింద ఖుంటి, రాంచీ, ఢిల్లీలో అతనిపై అనేక కేసులు నమోదయ్యాయి. అతనికి ఢిల్లీ, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో నెట్‌వర్క్‌లు విస్తరించి ఉన్నాయి. దేశ రాజధానిలో మహతో పన్నా లాల్ ప్లేస్‌మెంట్ ఏజెన్సీ పేరుతో ఒక ఏజెన్సీని కలిగి ఉంది" అని అధికారులు తెలిపారు. మానవ అక్రమ రవాణాకు సంబంధించిన కార్యకలాపాల ద్వారా జార్ఖండ్, ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో 'భారీ ఆస్తులు' కూడబెట్టినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గుర్తించినట్లు చెప్పారు. రాంచీ, ఖుంటియాలో భూమి రూపంలో కొన్ని స్థిరాస్తులు ఉన్నాయి.
మహ్తో తన పరిచయస్తులతో పాటు అనేక 'అధిక విలువ' లావాదేవీలతో అనేక బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది. ఈ లావాదేవీలు, నేరం ద్వారా వచ్చిన ఆదాయంలో సంపాదించి, లావాదేవీలు జరిపినట్లు తెలుస్తోంది. జార్ఖండ్‌కు చెందిన వందలాది మంది బాలికలను విక్రయించినట్లు పన్నాలాల్‌పై ఆరోపణలు ఉన్నాయి. పన్నాలాల్ అమ్మాయిలతో డీల్ చేసేవాడు.
ఢిల్లీలో ఉన్న ఏజెన్సీ పేరుతో అమ్మాయిలను అక్రమ రవాణ చేసేవాడు. ఉద్యోగాల పేరుతో అమ్మాయిలను అమ్మినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. పన్నాలాల్ భార్య కూడా అమ్మాయిల వ్యాపారంలో భర్తకు పూర్తి మద్దతు ఇచ్చింది. గిరిజన పిల్లలను డబ్బులు ఇస్తామని ప్రలోభ పెట్టి పన్నాలాల్ వారిని తన వెంట తీసుకెళ్లేవాడు. ఢిల్లీలోని మూడు ప్లేస్‌మెంట్ ఏజెన్సీల ద్వారా చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలను అక్రమ చేసేవాడు. జార్ఖండ్, ఒడిశా నుంచి తీసుకెళ్లిన పిల్లలను ఇంటిపని, కట్టుదిట్టమైన పనులు చేయిస్తున్నారని పన్నాలాల్ అంగీకరించాడు. చాలా మంది అమ్మాయిలను తప్పుడు వ్యాపారంలోకి దింపినట్లు తెలిసింది.