హైదరాబాద్‌లో మిస్టరీగా ఐదేళ్ల బాలిక హత్య కేసు.. ఎక్కడో చంపి.. ఇక్కడే ఎందుకు పడేశారు.!

Panjagutta Girl Death mystery. హైదరాబాద్‌లో ఓ షాపు ఎదుట ఐదేళ్ల వయస్సున్న బాలిక మృతదేహం కలకలం రేపింది. బాలిక అచేతనంగా పడి ఉండడంతో స్థానికులు

By అంజి  Published on  8 Nov 2021 9:01 AM IST
హైదరాబాద్‌లో మిస్టరీగా ఐదేళ్ల బాలిక హత్య కేసు.. ఎక్కడో చంపి.. ఇక్కడే ఎందుకు పడేశారు.!

హైదరాబాద్‌లో ఓ షాపు ఎదుట ఐదేళ్ల వయస్సున్న బాలిక మృతదేహం కలకలం రేపింది. బాలిక అచేతనంగా పడి ఉండడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళి పండగ రోజు జేవీఆర్‌ పార్కు ఎదుట ఉన్న ద్వారకాపురి కాలనీలోని ఓ షాపు వద్ద బాలిక విగతజీవిలా పడి ఉండటాన్ని గమనించారు స్థానికులు. వెంటనే పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించారు. దీంతో పంజాగుట్ట పోలీసులు ఘటనా స్థలికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. బాలిక అక్కడ పడి ఉండటాన్ని బట్టి.. ఎక్కడో చంపి ఇక్కడికి తెచ్చి పడేశారని పోలీసులు భావించారు. బాలిక అచేతనంగా పడి ఉన్న చోట ఎలాంటి రక్తపు మరకలు కనిపించలేదు.

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలిక పడి ఉన్న ప్రదేశం పరిసర ప్రాంతాల్లో దాదాపు 100కు పైగా సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అయినా నిందితులకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లను పోలీసులు గుర్తించలేకపోయారు. చిన్నారి మృతదేహంపై పాత గాయలు ఉన్నాయని, అత్యాచారం జరిగిన దాఖలాలు లేవని ఓ పోలీసు అధికారు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిస్సింగ్‌ కేసు వివరాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇక బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా బాలిక ఎప్పుడు, ఎలా మరణించింది అన్న విషయాలు తెలుస్తాయని, రెండు రోజుల్లో నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మరో వైపు క్షుద్రపూజల కోసం బాలికను హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story