వరంగల్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై బూతులు.. నా కారునే ఫొటో తీస్తావా అంటూ..

PACS chairman harsh behaviour on constable . వరంగల్‌ జిల్లా నర్సంపేటలో ఓ నాయకుడు కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించాడు. ఆగకుండా బూతులు తిడుతూ గొడవకు దిగాడు.

By అంజి
Published on : 6 Nov 2021 2:48 PM

వరంగల్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై బూతులు..  నా కారునే ఫొటో తీస్తావా అంటూ..

వరంగల్‌ జిల్లా నర్సంపేటలో ఓ నాయకుడు కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించాడు. ఆగకుండా బూతులు తిడుతూ గొడవకు దిగాడు. కారులో ప్రయాణిస్తూ సీట్‌ బెల్ట్‌ పెట్టుకోకపోవడంతో.. కారును ఫొటో తీశాడు రోడ్డుపై ఉన్న కానిస్టేబుల్‌. అది చూసిన కారులో ఉన్న పీఏసీఎస్‌ చైర్మన్‌ మోహన్‌ రెడ్డి కారు దిగి కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగారు. నా కారునే ఫొటో తీస్తావా.. నేనెవరో తెలుసా అంటూ కానిస్టేబులతో గొడవ చేశాడు. ఫొటో ఎందుకు తీస్తున్నావంటూ, పోలీస్‌ స్టేషన్‌ వెళ్దామంటూ మోహన్‌ రెడ్డి అనగా.. పోలీస్‌ స్టేషన్‌కి కాదు సీపీ దగ్గరికి వెళ్దామని కానిస్టేబుల్‌ అన్నాడు. ఇదంతా ఆ కానిస్టేబుల్‌ వీడియో తీశాడు. అనంతరం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. నర్సంపేట పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.


Next Story