Hyderabad: రూ.5 లక్షల విలువైన 53 గ్రాముల కొకైన్‌తో పట్టుబడ్డ వైద్యురాలు

ఒమేగా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నగరానికి చెందిన ఒక వైద్యురాలిని.. అధిక విలువ కలిగిన డ్రగ్ రాకెట్‌లో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై అరెస్టు చేశారు.

By అంజి
Published on : 10 May 2025 1:39 PM IST

Omega Hospitals doctor, cocaine, police, Hyderabad, Crime

Hyderabad: రూ.5 లక్షల విలువైన 53 గ్రాముల కొకైన్‌తో పట్టుబడ్డ వైద్యురాలు

హైదరాబాద్: ఒమేగా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నగరానికి చెందిన ఒక వైద్యురాలిని.. అధిక విలువ కలిగిన డ్రగ్ రాకెట్‌లో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై అరెస్టు చేశారు. నిందితురాలు డాక్టర్ నమ్రత చిగురుపతి (34) కొకైన్‌కు బానిస అయ్యింది. ఆమె ముంబైకి చెందిన ఓ సప్లయర్‌ నుండి మాదకద్రవ్యాలను కొనుగోలు చేస్తూ పట్టుబడింది.

రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ సిహెచ్ వెంకన్న మాట్లాడుతూ.. డాక్టర్ నమ్రత ముంబైకి చెందిన వంశ్ ధక్కర్‌ను వాట్సాప్ ద్వారా సంప్రదించి రూ. 5 లక్షల విలువైన కొకైన్ ఆర్డర్ చేసిందని, ఆ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో బదిలీ చేసింది. వంశ్ కింద పనిచేస్తున్న డెలివరీ ఏజెంట్ బాలకృష్ణ అలియాస్ రాంప్యార్ రామ్ (38) ద్వారా హైదరాబాద్‌కు డ్రగ్స్ డెలివరీ చేశారని చెప్పారు.

ఒక పక్కా సమాచారం మేరకు రాయదుర్గం పోలీసులు మాదకద్రవ్యాలను అందజేసే సమయంలో నమ్రత, బాలకృష్ణ ఇద్దరినీ అరెస్టు చేశారు. అనుమానితుల నుండి 53 గ్రాముల కొకైన్, రూ. 10,000 నగదు, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దర్యాప్తులో డాక్టర్ నమ్రత ఇప్పటి వరకూ దాదాపు రూ.70 లక్షలు డ్రగ్స్ కోసం ఖర్చు చేసినట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు కొనసాగుతోంది, నగరంలో పనిచేస్తున్న డ్రగ్ నెట్‌వర్క్‌లతో విస్తృత సంబంధాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Next Story