దారుణం.. పెళ్లైన నెలకే భార్యను అమ్మేసి
Odisha teen sold wife to Rajasthan man month after wedding.55 ఏళ్ల వ్యక్తికి పెళ్లైన ఒక నెల తర్వాత తన భార్యను
By తోట వంశీ కుమార్ Published on 23 Oct 2021 1:20 PM IST55 ఏళ్ల వ్యక్తికి పెళ్లైన ఒక నెల తర్వాత తన భార్యను విక్రయించాడనే ఆరోపణలపై 17 ఏళ్ల యువకుడిని ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఆగ్నేయ రాజస్థాన్ జిల్లా బారన్ నుండి 26 ఏళ్ల మహిళను పోలీసులు రక్షించారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రంలోని సులేకెలా గ్రామానికి చెందిన రాజేష్ రాణా(17) అనే యువకుడు 26 ఏళ్ల యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వివాహం అయిన నెల రోజుల తరువాత ఇటుకల బట్టీలో పనిచేసేందుకు రాజస్థాన్ వెళ్లారు. అక్కడ ఓ 55 ఏళ్ల వ్యక్తికి రాజేష్ తన భార్యను రూ.1.8లక్షలకు విక్రయించాడు. అనంతరం ఓ మంచి కొత్త స్మార్ట్‌పోన్‌ను కొన్నాడు. డబ్బులతో జల్సా చేసి..అక్కడి నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆ యువతి తల్లిదండ్రులు ఆమె ఎక్కడ అని రాజేష్ ను ప్రశ్నించగా.. తనను వదిలి ఆమె వెళ్లిపోయిందని సమాధానం ఇచ్చాడు.
అతడు చెప్పిన సమాధానం నమ్మని ఆమె తల్లిదండ్రులు బెల్పాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు రాజేష్‌ను విచారించగా అసలు నిజం చెప్పాడు. రాజస్థాన్‌లో యువతి ఉన్నట్లు గుర్తించి.. అక్కడికి వెళ్లి యువతిని తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా.. అక్కడి గ్రామ ప్రజలు తిరగబడ్డారు. అతి కష్టం మీద ఆమెను తీసుకువచ్చారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. రాజేష్‌ను జువైనల్ కోర్టులో హాజరుపరిచి కరెక్షన్ హోంకు తరలించారు.