నర్సింగ్ విద్యార్థిని కిడ్నాప్, లైంగిక వేధింపులు

తమిళనాడులోని తేని జిల్లాలో చదువుతున్న నర్సింగ్‌ విద్యార్థినిని ఓ ముఠా అపహరించి లైంగికంగా వేధించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.

By అంజి  Published on  24 Sept 2024 10:44 AM IST
Nursing student, sexually assaulted ,Tamil Nadu, Crime

నర్సింగ్ విద్యార్థిని కిడ్నాప్, లైంగిక వేధింపులు

తమిళనాడులోని తేని జిల్లాలో చదువుతున్న నర్సింగ్‌ విద్యార్థినిని ఓ ముఠా అపహరించి లైంగికంగా వేధించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. రైల్వే స్టేషన్‌లో బాధిత విద్యార్థిని పోలీసులు గుర్తించారు. నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని బస్సులో స్వగ్రామం నుంచి బయలుదేరింది. నల్లటి దుస్తులు ధరించిన ఓ మహిళ తనను వెంబడిస్తున్నట్లు తెలియజేసేందుకు ఆమె తన తండ్రికి ఫోన్ చేసిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత విద్యార్థిని ఫోన్ రీచ్ కాకపోవడంతో ఆమె తండ్రి తేని పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.

ఆమె తరువాత దిండిగల్ రైల్వే స్టేషన్‌లో కనుగొనబడింది, అక్కడ ఆమె పోలీసులను ఆశ్రయించింది. స్టేషన్ నుండి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో తనను అపహరించి, లైంగిక వేధింపులకు గురి చేసి రైల్వే స్టేషన్‌లో వదిలివేసినట్లు వారికి చెప్పింది. విద్యార్థినిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రదీప్ ఆసుపత్రిని సందర్శించి విచారణ చేపట్టారు. విద్యార్థిని ప్రశ్నిస్తున్నప్పుడు మూర్ఛ వచ్చి పడిపోయింది. దీంతో పోలీసులు ఆమెను ప్రశ్నించడం సవాలుగా భావిస్తున్నారు. మహిళా పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story