'కొంచెమైనా పశ్చాత్తాపం లేదు'.. జైల్లో సోనమ్ రఘువంశీ వైఖ‌రి ఎలా ఉందంటే.?

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీ తాజాగా ఒక నెల పోలీసు కస్టడీని పూర్తి చేసుకుంది.

By Medi Samrat
Published on : 21 July 2025 2:12 PM IST

కొంచెమైనా పశ్చాత్తాపం లేదు.. జైల్లో సోనమ్ రఘువంశీ వైఖ‌రి ఎలా ఉందంటే.?

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీ తాజాగా ఒక నెల పోలీసు కస్టడీని పూర్తి చేసుకుంది. తన భర్త రాజా రఘువంశీ హత్య కేసులో సోనమ్ నిందితురాలిగా వార్తల్లో నిలిచారు. సోనమ్ రఘువంశీ షిల్లాంగ్ జైల్లో ఉండబ‌ట్టి నెల రోజులు కావస్తున్నా ఆమె వైఖరి ఇప్పటికీ అలాగే ఉంది.

పోలీసుల అదుపులో ఉన్నా సోనమ్‌లో ఎలాంటి మార్పు లేదు. తన భర్తను చంపినందుకు ఆమెకు ఎలాంటి పశ్చాత్తాప ప‌డ‌టం లేదు. అలాగే, ఆమె కుటుంబ సభ్యులెవరూ తనను కలవడానికి రాలేదు. సోనమ్ కూడా జైలు వాతావరణానికి తగ్గట్టుగా న‌డుచుకుంటుంది. NDTV నివేదిక ప్రకారం.. సోనమ్ ఇతర మహిళా ఖైదీలతో బాగా కలిసిపోయింది. ప్రతిరోజూ ఉదయం సరైన సమయానికి మేల్కొంటుంది. జైలు మాన్యువల్‌ను అనుసరిస్తుంది.

సమాచారం ప్రకారం.. సోనమ్ తన భర్త హత్య గురించి లేదా తన వ్యక్తిగత జీవితం గురించి ఏ ఖైదీతో లేదా జైలు సిబ్బందితో మాట్లాడలేదు. ఆమె జైలు వార్డెన్ కార్యాలయానికి సమీపంలోని బ్య‌రెక్‌లో ఉంటుంది. ఇద్దరు అండర్ ట్రయల్ మహిళా ఖైదీలతో ఆమె బ్యారెక్‌ను పంచుకుంటుంది.

సోనమ్‌కు జైలు లోపల ఇంకా ఎలాంటి పని అప్పగించలేదు. అయితే ఆమెకు టైలరింగ్, స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన ఇతర పనులు నేర్పించనున్న‌ట్లు తెలుస్తుంది. జైలు నిబంధనల ప్రకారం.. సోనమ్ తన కుటుంబ సభ్యులను కలవవచ్చు.. కానీ ఆమె ఎవరినీ కలవలేదు.. క‌నీసం ఎవ‌రికీ కాల్ చేయలేదని నివేదిక‌లు పేర్కొన్నాయి.

Next Story