శ్మశాన వాటికలో.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం

Nine Year old girl was raped in Parvathipuram Manyam District. తొమ్మిదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పార్వతీపురం

By అంజి  Published on  3 Jan 2023 2:43 PM IST
శ్మశాన వాటికలో.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం

శ్మశాన వాటికలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. డీఎస్పీ జివి కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని వీరఘట్టం గ్రామానికి చెందిన ఓ బాలిక రాత్రి 7 గంటలకు కాలకృత్యాల కోసం బయటకు వెళ్లింది. అదే సమయంలో గ్రామానికి చెందిన గురునాయుడు (48) అనే వ్యక్తి బాలికను బలవంతంగా పట్టుకుని శ్మశాన వాటికకు పారిపోయాడు. బాలిక కేకలు వేయడంతో ఆమె నోరు మూసే ప్రయత్నం చేశాడు. సమీపంలోని శ్మశాన వాటికకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

అయితే బాలిక కేకలు విన్న స్థానికులు నిందితుడు పారిపోవడం చూశారు. నిందితుడు పక్క ఊరిలో ఉన్నాడని గుర్తించి.. స్థానికులు అతడిని పట్టుకుని కొట్టారు. బాలికను కుటుంబసభ్యులకు అప్పగించారు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు గురునాయుడుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు. అంతకుముందు భోపాల్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ మైనర్ బాలికపై సొంత మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story