లడఖ్‌లో ఘోర ప్రమాదం.. 9 మంది భారత జవాన్లు మృతి

లడఖ్‌లోని లేహ్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By Medi Samrat  Published on  19 Aug 2023 9:40 PM IST
లడఖ్‌లో ఘోర ప్రమాదం.. 9 మంది భారత జవాన్లు మృతి

లడఖ్‌లోని లేహ్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండియన్ ఆర్మీ వాహనం కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది జవాన్లు మరణించారు. ఈ ప్ర‌మాదంలో ఒక జవాన్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. చనిపోయిన, గాయపడిన సైనికుల వివ‌రాలు తెలియాల్సివుంది. ఇండియన్ ఆర్మీ వాహనం లేహ్ నుండి నయోమా వైపు వెళుతోంది. లడఖ్ రోడ్డు ప్రమాదం క్యారీకి ఆరు కిలోమీటర్ల ముందు జరిగింది. ఆర్మీ వాహ‌నం లోతైన గుంతలో పడిపోయింది. సాయంత్రం 5.45 గంటలకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది జవాన్లు మరణించారు. శనివారం సాయంత్రం దక్షిణ లడఖ్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story