హైదరాబాద్‌లో విషాదం..ఇష్టంలేని పెళ్లి చేశారని నవ వధువు ఆత్మహత్య

హైదరాబాద్‌లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం జరిగింది.

By Knakam Karthik
Published on : 8 March 2025 2:24 PM IST

Crime News, Hyderabad News, Newly Married Woman commits suicide

హైదరాబాద్‌లో విషాదం..ఇష్టంలేని పెళ్లి చేశారని నవ వధువు ఆత్మహత్య

హైదరాబాద్‌లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం జరిగింది. పెళ్లయిన నెల రోజులకే నవ వధువు సూసైడ్ చేసుకున్న ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. బాల్‌రెడ్డినగర్‌లో నివాసం ఉంటోన్న విజయగౌరి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఆమె బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఫిబ్రవరి 6వ తేదీన ఈశ్వరరావు అనే వ్యక్తితో విజయగౌరికి వివాహం జరిగింది.

అయితే వివాహం తర్వాత ఈ నూతన జంట బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాల్‌రెడ్డినగర్‌లో నివాసం ఉంటున్నారు. ఉదయం భర్త లేచి చూసేసరికి విజయ గౌరీ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇష్టం లేని వివాహం చేయంతోనే సూసైడ్‌ చేసుకున్నట్లు అనుమానం.

కాగా మృతురాలి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కాగా ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.

Next Story