రాజస్థాన్‌లోని అల్వార్‌లో పెళ్లయిన నెల రోజులకే ఓ నవవధువు దారుణానికి ఒడిగట్టింది. విక్రమ్‌జీత్ సింగ్ అనే వ్యక్తి రేఖా కౌర్ అనే మహిళను 2025 మే 26న గురుద్వారాలో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లికి ముందే తమ మధ్య కోర్టు ఒప్పందం జరిగిందని, మొదటి భర్తతో విడాకులు పూర్తయ్యాయని రేఖా కౌర్ కుటుంబ సభ్యులు నమ్మించడంతో విక్రమ్‌జీత్ దాదాపు ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ వివాహం చేసుకున్నాడు.
కానీ, అనూహ్యంగా పెళ్లయిన నెల రోజులకే రేఖా కౌర్ తన అత్తకు విషం ఇచ్చి, ఇంట్లోని నగలు, నగదుతో ఉడాయించింది. ఈ ఘటనతో విక్రమ్‌జీత్ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. నమ్మించి మోసం చేయడమే కాకుండా, ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించి పరారైన ఆ కిలాడీ కోడలిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితురాలు పక్కా పథకం ప్రకారమే ఈ కుట్రకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.