హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్న జంట బుధవారం తమ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. బంధువులు, స్నేహితుల చెబుతున్న వివరాల ప్రకారం.. వారి ఆత్మహత్య వెనుక ఆర్థిక సమస్యలు ఉన్నాయని తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆసియా హషీమ్ ఖాన్, రాజస్థాన్‌కు చెందిన పవన్ కుమావత్ అనే ఇద్దరు వ్యక్తులు అంబర్‌పేటలోని లక్ష్మీ నగర్‌లోని వారి అద్దె ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌లకు వేలాడుతూ కనిపించారు. ఆ జంట రోజంతా బయటకు అడుగు పెట్టకపోవడంతో పొరుగువారు తలుపులు తెరిచి చూడగా.. ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. వారు ఒక పరిచయస్తుడిని అప్రమత్తం చేశారు, ఆ తర్వాత అతను పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణం అని సమాచారం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ దంపతులు ఒత్తిడికి గురయ్యారని బంధువులు వెల్లడించారు. అంబర్ పేట్ ఇన్స్ పెక్టర్ టి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో ఆ జంట నిరాశకు గురై ఉండవచ్చని, అదే ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని అన్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.